Posts

Showing posts from February, 2012

Scam! Scam! Scam!

లూఠీ లూఠీ లూఠీ, చూపిస్తుంటారు లాఠి, దోచుకుంటుంటారు శతకోటి, లేరెవ్వరు వీరి సాటి, రాజకీయులతోనా పోటి, వీరి బుర్రలు చాలా గట్టి, గొడవలు వీరికి పరిపాటి, కలిసే తీరుని బట్టి, చూపును గుర్తులు తలుపులు తట్టి, కొత్త కొత్త పార్టీలు పుట్టి, నొట్లతో చేతులు కట్టి, గుద్దును ఒట్లు కొట్టీ! కొట్టీ! పిచ్చి పిచ్చి పథకాలు పెట్టి, ప్రభుత్వానికి పంగనామలు చుట్టి, బినామీలతో నింపును స్విస్స్ తొట్టి! 

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

గడిచే కాలం పెరిగేకొద్ది మోయలేని భారం హృదయాన్ని కృంగతీస్తుంటే ప్రేమను వెతుకుతూ సుదూర తీరాలన్నీ ప్రయానిస్తున్నాను, తెలుసుకుందామని. ఇది వెతికితే దొరికేదికాదు, పంచుకుంటే పెరిగేది అని తెలియక ప్రయాణం సాగించాను. గడిచిన కాలాన్ని తిరిగి చూసుకుంటే నా ఒంటరి ప్రయాణానికి తోడుగా నిలిచిన స్నేహాన్ని చూశాను, ఆగిపోయాను. సరదాగా తిరిగాను, ఆటలాడాను, నువ్వే ప్రేమని తెలియక ఎన్నాళ్ళో నీ చుట్టూ తిరుగుతూనే గుర్తుపట్టలేకపోయాను. నాలో నువ్వున్నావని తెలియక ఎక్కడెక్కడో వెతికాను, అలిసిపోయాను. నువ్వు దూరమైతేగాని తెలియలేదు ఇది ప్రేమని, నేను పంచుకుంది స్నేహాన్ని కాదని. వదిలిపోయావు ఒంటరిని చేసి, ప్రేమకు చెరగని గుర్తుగా నన్ను మిగిల్చేసి.