Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)
గడిచే కాలం పెరిగేకొద్ది మోయలేని భారం హృదయాన్ని కృంగతీస్తుంటే ప్రేమను వెతుకుతూ సుదూర తీరాలన్నీ ప్రయానిస్తున్నాను, తెలుసుకుందామని.
ఇది వెతికితే దొరికేదికాదు, పంచుకుంటే పెరిగేది అని తెలియక ప్రయాణం సాగించాను.
గడిచిన కాలాన్ని తిరిగి చూసుకుంటే నా ఒంటరి ప్రయాణానికి తోడుగా నిలిచిన స్నేహాన్ని చూశాను, ఆగిపోయాను.
సరదాగా తిరిగాను, ఆటలాడాను, నువ్వే ప్రేమని తెలియక ఎన్నాళ్ళో నీ చుట్టూ తిరుగుతూనే గుర్తుపట్టలేకపోయాను.
నాలో నువ్వున్నావని తెలియక ఎక్కడెక్కడో వెతికాను, అలిసిపోయాను.
నువ్వు దూరమైతేగాని తెలియలేదు ఇది ప్రేమని, నేను పంచుకుంది స్నేహాన్ని కాదని.
వదిలిపోయావు ఒంటరిని చేసి, ప్రేమకు చెరగని గుర్తుగా నన్ను మిగిల్చేసి.
Super Feeling...
ReplyDeleteSuper Feeling...
ReplyDelete