నా అర్ధ బాగం (My Best Half)
నా మనసే పరవశించు వేళ నీ పలుకుల పరిమళాలే వెదజల్లగ రావె, నా కన్నులే వేచిచూడు వేళ నీ వన్నెల వెన్నెలలే చూపగ రావె, నా తనువే పులకరించు వేళ నీ లేత పరువాలే ఒదగగ రావె, నా అడుగులే దారులెతుకు వేళ నీ ఒంటి ఒయ్యారాలే ఒలకగ రావె, నా కవితలే పదములెతుకు వేళ నీ నామమునే నాంది పలుకగ రావె, రావె రావె వయ్యారి భామ నీ హంస నడకలే తొందరగా వేసి నా జత చేరగ రావె, అలుకలిడక దాగి ఉన్న నీ రూపునే చూపి నా దారి మల్లించగ రావె, నీ రూపులేని చిత్రాన్ని అందంగా గీసుకున్న నా మదిలో కొలువవ్వగ రావె...!!! naa manasae paravaSimchu vaeLa nee palukula parimaLaalae vedajallaga raave, naa kannulae vechichooDu vaeLa nee vannela vennalalae choopaga raave, naa tanuvae pulakarimchu vaeLa nee laeta paruvaalae vodagaga raave, naa aDugulae daaruletuku vaeLa nee onTi voyyaaraalae olakaga raave, naa kavitalae padamuletuku vaeLa nee naamamunae naandi palukaga raave, raave raave vayyaari bhaama nee hamsa naDakalae tondaragaa vaesi naa jata cheraga raave, alukaliDaka daagi unna nee roo...