Posts

Showing posts from July, 2012

నాలో నేను!

మనసులో ఏవో చెరగని గాయాలు మౌనాన్నే తట్టి లేపుతుంటే, మదిలో  ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి! పాల సముద్రం లాంటి నా కళ్ళలో ఎర్రటి నెక్తుటి అలలు సాగరాన్నే కప్పేస్తున్నాయి! పిడికిలంత ముద్దలు తినిపించే చేతులు పంజాలనే విసరాలంటున్నాయి! నలుగురి బాటలో నడిచే నా కాళ్ళు పరుగులంఖించి భూమిని దద్దరిల్లేట్టు చేయాలంటున్నాయి! నరాల్లో ఏదో నిడివంత ప్రవాహం నరుడ్ని నిలువెల్లా దహిస్తుంటే, నరనరాలు చిట్లించిన మొహం నరరూప రాక్షసుల అంతం చూస్తానంటోంది. రెక్కలు విచ్చుకున్న నా చెవులు వారి చావు కెకలనే వినాలంటున్నాయి!

Power

సంసారం అనే సాగరాన్ని ఈదే శక్తి నాకు లేకపోయినా ఫర్వాలేదు కాని నాలా పయనించే వాళ్ళని ఇతర జీవులకు బలికాకుండా కాపాడే శక్తి నివ్వు.

స్వాతంత్ర్యాం కోసం పోరాడిన ఆరోజు నుంచి పోరాడుతున్న ఈరోజు వరకు మధ్య సమయం

కుల గోత్రాలు, జాతకాలు, వాస్తు శాస్త్రాలు ఎందుకు పుట్టాయోగాని వాటిని చాల మంది మరిచిపోతున్నారు ఈరొజుల్లో. ప్రేమ అనే బంధం వీటికి అతీతంగ నడుస్తూ వీటిని రూపుమాపుతోంది. ఇదేకాక విఙ్ఞాన ప్రపంచం ఆధునికత అంటూ అందరు తప్పు దారులు పడుతున్నారు. హిందూ శాస్త్ర ధర్మాలు అని పూర్వీకులు ఎందుకు పెట్టారోగాని, వీటి గురుంచి ఎంతో శోధన చేసి ప్రజలకి అప్పట్లో నమ్మకం కలిగించారు.రాను రాను మనవాళ్ళు మన సంస్క్రుతి మరిచి ప్రవర్తిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అందుకు ప్రధాన కారణం జనాభా సంఖ్య అమాంతం పెరిగిపోవటం. దీని వల్ల అందరు ముందుగా బ్రతకటానికి చూస్తారు. బ్రతకటానికి డబ్బు కావలి. డబ్బు కావాలంటే సంపాదించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి ఒక మగాడు సంపాదిస్తే సరిపోవడంలేదు. అందుకని ఆడాళ్ళూ సముపార్జనలో దిగారు. కొందరు కూటికోసమైతే, కొందరు ఆధునికత, తళుకుల ప్రపంచంలోని అందాలను వీక్షించడం కోసం. అలా ఆడ మగ తేడాలేకుండా సంపాదన కోసం ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి ఇంకొకరికి మధ్య దూరం చెరిగిపోయి పరిచయాలు పెరిగిపోయి ఆకర్షణకి గురయ్యి, మత్తులో మునిగి తేలుతు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తున్నారు. రాను రాను సంసా...

Political Drama

రాజకీయులు,  తూర్పులో కూర్పు చెసి,  దక్షిణాన దాగుండి,  పడమట పంజా విసురుతారు,  నిన్ను ఉత్తరాన పడుకోబెట్టడానికి!!!