నాలో నేను!
మనసులో ఏవో చెరగని గాయాలు మౌనాన్నే తట్టి లేపుతుంటే, మదిలో ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి!
పాల సముద్రం లాంటి నా కళ్ళలో ఎర్రటి నెక్తుటి అలలు సాగరాన్నే కప్పేస్తున్నాయి!
పిడికిలంత ముద్దలు తినిపించే చేతులు పంజాలనే విసరాలంటున్నాయి!
నలుగురి బాటలో నడిచే నా కాళ్ళు పరుగులంఖించి భూమిని దద్దరిల్లేట్టు చేయాలంటున్నాయి!
నరాల్లో ఏదో నిడివంత ప్రవాహం నరుడ్ని నిలువెల్లా దహిస్తుంటే,
నరనరాలు చిట్లించిన మొహం నరరూప రాక్షసుల అంతం చూస్తానంటోంది.
రెక్కలు విచ్చుకున్న నా చెవులు వారి చావు కెకలనే వినాలంటున్నాయి!
Comments
Post a Comment