స్వాతంత్ర్యాం కోసం పోరాడిన ఆరోజు నుంచి పోరాడుతున్న ఈరోజు వరకు మధ్య సమయం


కుల గోత్రాలు, జాతకాలు, వాస్తు శాస్త్రాలు ఎందుకు పుట్టాయోగాని వాటిని చాల మంది మరిచిపోతున్నారు ఈరొజుల్లో. ప్రేమ అనే బంధం వీటికి అతీతంగ నడుస్తూ వీటిని రూపుమాపుతోంది. ఇదేకాక విఙ్ఞాన ప్రపంచం ఆధునికత అంటూ అందరు తప్పు దారులు పడుతున్నారు. హిందూ శాస్త్ర ధర్మాలు అని పూర్వీకులు ఎందుకు పెట్టారోగాని, వీటి గురుంచి ఎంతో శోధన చేసి ప్రజలకి అప్పట్లో నమ్మకం కలిగించారు.రాను రాను మనవాళ్ళు మన సంస్క్రుతి మరిచి ప్రవర్తిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అందుకు ప్రధాన కారణం జనాభా సంఖ్య అమాంతం పెరిగిపోవటం. దీని వల్ల అందరు ముందుగా బ్రతకటానికి చూస్తారు. బ్రతకటానికి డబ్బు కావలి. డబ్బు కావాలంటే సంపాదించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి ఒక మగాడు సంపాదిస్తే సరిపోవడంలేదు. అందుకని ఆడాళ్ళూ సముపార్జనలో దిగారు. కొందరు కూటికోసమైతే, కొందరు ఆధునికత, తళుకుల ప్రపంచంలోని అందాలను వీక్షించడం కోసం. అలా ఆడ మగ తేడాలేకుండా సంపాదన కోసం ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి ఇంకొకరికి మధ్య దూరం చెరిగిపోయి పరిచయాలు పెరిగిపోయి ఆకర్షణకి గురయ్యి, మత్తులో మునిగి తేలుతు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తున్నారు. రాను రాను సంసారం అనే పధ్ధతైన జీవితాన్ని మరిచి కలిసి జీవిస్తే చాలు అదే సంసారం అనుకుంటున్నారు. పెళ్ళి అనే క్రమాన్నే మరిచిపొవాలనుకుంటున్నారు. ఒక్కప్పుడు ఇంటిపని, బయటపని అని ఉండేవి, వాటిని ఆడ, మగ పంచుకునేవారు. ఇప్పుడు పేద, ధనిక జీవులు పంచుకుంటున్నారు. బడుగు వర్గం ఇంటి పని చేస్తుంటే ధనిక వర్గం బయట పని చేస్తోంది.
ఇక ఆడవాళ్ళ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే సంపాదన కోసం మగవాళ్ళతో పోటీపడుతున్నారు. పూర్వకాలంలో వంటింటి కుందేళ్ళు అన్న నానుడిని మార్చేయాలని ప్రభుత్వం ఎదుట పట్టుబట్టి 30% కేటాయింపు రాబట్టారు. ఇక ఎందులోనైన ముందుండాలని వారి పాతతరం ఆలోచనలని చెరిపేసి ప్రక్రుతి అందాలను వీక్షించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ స్థితికి ఎదిగి మగవాళ్ళకు ధీటుగా నిలబడటమే కాదు వారికేనా మీసాలు, గడ్డాలు మేము పెంచగలం అని నిరూపిస్తున్నారు. ఇక ఆధునికత అంటూ, ఉన్న జడని కత్తిరించుకుని కొందరు తిరుగుతుంటే మరి కొందరు కాలుష్యానికి ఉండేది ఊడగొట్టుకుని తిరుగుతున్నారు.
యంత్రాంగాలు ఊపందుకున్న రోజులు మొదలు మన వాళ్ళకి పడమటి వాస్తు బాగా అచ్చోస్తోంది. ఏమి చేస్తారు పాపం బ్రిటిష్ పాలన, పొర్చుగీసు పాలన, మొగలాయుల పాలన, వారి పాలన వీరి పాలన అంటు రకరకాల జాతులు ఒక దాని తర్వాత మరోటి, కొన్ని కలిసి పరిపాలించడంతో మనకు ఒక సంస్క్రుతి కాదు, భిన్న సంస్క్రుతులు వంటబట్టాయి. ఈ క్రమంలో బానిసలుగా కొందరు వెళ్తే, పాలకుల కనుసన్నుల్లో ఆనందంగా వెనకేసుకుని సముద్రాలు దాటిన వారు కొందరు. బలమున్న వాళ్ళు ఎదురు తిరిగి ప్రక్క దేశాలతో సత్సంబంధాలు ఎర్పరుచుకుని వెళ్ళిన వారు మరికొందరు. ఇలా మనవాళ్లు ప్రవాసీయులయ్యరు. అలా అయిన వాళ్ళు అక్కడ ఇక్కడా అంటు తిరుగుతుండటం వళ్ళ అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడ వంటబట్టడం ప్రరంభమయ్యాయి. అలా మనవాళ్ళు పడమటి సంధ్యా రాగాలు పాడుకుంటూ, పడమటి జాతిలో కలిసిపోయి పడమటి పారాయణం అప్పుడే మొదలుపెట్టారు.
అలా మనది అంటు చెప్పుకునే దానికి ఏమి లేకుండా పోయింది. ఇది అందరిది అన్న నినాదం వ్యవస్థలో పాతుకుపోయింది. సంస్క్రుతులు భిన్నమైనా మానవత్వం ఒక్కటే అని సర్దుకుపోవడం మొదలుపెడితే, రాజకీయం అనే రాక్షసనీతి(అసలు రాజకీయం రాక్షసత్వంగా ఎందుకు మారిందో కొనసాగింపులో చదువుకుందాంలేండి) దేశాన్ని పొరుగు పాలన నుండి కాపాడుకున్న తరువాత, దాన్ని రెండుగా చీల్చిన తరువత పాతతరం వేదాలు, ధర్మాలను వన్టపట్టించుకోలేక పొరుగువారు మనకు మిగిల్చిన రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలనా ధర్మం, కాపుకాసే న్యాయం అంటు దిన దినాభివ్రుధ్ధి చెందింది.
అల్లకల్లోలంగా, చిందర వందరగా, కూటికి గుడ్డకి గతిలేకుండా, బానిసలుగా మార్చిన పొరుగు పాలకులు మనవాళ్ళకి స్వాతంత్ర్యం అని ఒక్క మాట చెప్పి వదిలి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక మనవళ్ళు కొట్టుకు చస్తుంటే ఇంతలో మమల్నిసరిగ్గా చుడటంలేదంటే మమల్ని చుడటంలేదంటూ గుంపులు కూడి సంఘాలని ఏర్పరుచుకుని వారు అసాంఘిక శక్తులుగా మారిపోయారు. ఇదేమి తెలియని పాలకులు వారి వారి బంగారు ముద్దలు(క్షమించాలి అన్నం ముద్దలే తిన్నారు అప్పటికింకా) తింటూ ప్రజలు ప్రభుత్వం కలిసి ఎలా పనిచేయాలో పథకాలు రాసుకుంటూ అమలుచేయటం మరిచిపోయారు. అలాంటి సమయంలో అశాంఘిక శక్తులు ఎదురుతిరగటం మోదలుపెట్టాయి. ఏమి చేయాలో తెలియని ప్రభుత్వం ఊరిపెద్దల్ని నియమించి ప్రజల అవసరాల్ని తీర్చమని రోజుకొక వెండి ముద్ద పెట్టింది. అన్నం ముద్ద తిని తిని విసుగొచిన ఊరిపెద్ద మరికొందరు పెద్దలతో కలిసి ప్రజలకి ప్రభుత్వం వెండి ముద్ద పెట్టిందనే సంగతి చెప్పొదని చెప్పి అందరికి తలా కొంచం పంచి తను బాగా రుచి మరిగాడు. రుచి మరిగినవాడు ఇక అన్నం ముద్ద తినలేక ప్రజలకు ఏమి పెట్టలేక మిగిలిన పెద్దలను కూడగట్టుకుని మనమంతా ఒక కులమని చెప్పి ప్రజలకు మళ్ళీ అదే బానిస బ్రతుకు చూపించడం మొదలుపెట్టాడు.
అసలు అన్నం ముద్దే ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఏమి చేయాలో పాలుపోక పెట్టింది తిని వారి వారి వ్రుత్తి ధర్మాలు నిర్వర్తించడం ప్రరంభించారు. ఈ క్రమంలో వ్రుత్తికి వ్రుత్తికి వ్యత్యాసం ఏర్పడి అంటరానితనం అన్న మాటే పెను ముప్పై దేశ వ్యవస్థలో మార్పులకు పునాదిలేపింది. అలా ధనిక వ్రుత్తిలో ఉన్నవాళ్ళకు పెఏద వ్రుత్తిలో ఉన్నవాళ్ళకు కేటాయింపులు మొదలయ్యాయి. ఆ కేటాయింపులు కాస్తా వ్రుత్తి మార్గాన్ని విడిచి కులమతాల దారిలో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇదే సందుగా భావించిన దిగువ వర్గంవారు పాలకులకు వెండి ముద్ద తినే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతటితో ఊరుకోక మిగిలిన వర్గాలవారికి కూడా అన్నం ముద్దే కాదు ఇక్కడ రకరకాల ముద్దలున్నాయని చెప్పడం మొదలుపెట్టారు. ఇవ్వన్ని గమనిస్తున్న ఊరిపెద్దలు వర్గానికొక నయకుడ్ని ఏర్పాటు చేసి వాడికి వెండి ముద్ద పెట్టి ప్రభుత్వం దగ్గర బంగారు ముద్ద తెచ్చుకుని మిగిలిన పెద్దలతో కలిసి తినడం మొదలుపెట్టాడు. అలా వర్గ నాయకులు, పెద్దలు రకరకాల క్రొత్త రుచులు చుడటం వాటికి మారిపోవడం మొదలుపెట్టారు. ఈ మార్పులు అసలు ధనిక వ్రుత్తి, పేద వ్రుత్తి అనే వాటిని నాశనం చేసి కేటాయించడం, భుజించడం అన్న క్రొత్త ఆచారాల్ని వెలుగులోకి తెచ్చాయి. ప్రజలు మాత్రం దేశం మీద మమకారం చంకోలేక ప్రభుత్వం పెట్టే అన్నం ముద్ద కోసం ఎదురుచూస్తూ దొరికిన రోజు తిని లేని రోజు పస్తులుండటం అలవాటు చేసుకున్నారు.
తెలివిగలవాళ్ళు కొందరు అప్పుడప్పుడు దేశంలో కనిపించినా వారికి మిగితవాళ్ళని ఎలా తెలివిగలవాళ్ళుగా మార్చాలో తెలియక పాలకులనుంచి బంగారు ముద్దలను ఎలా తరలించాలో తెలియక, తెలిసినా ఏమీ చేయలేక, చేసిన ఎక్కువ రోజులు నిలవలేక రాజకీయాన్ని వదిలిపోయారు. కొందరు మాత్రం పట్టువిడవక అలా వదిలి వెళ్ళిపోక రకరకాల ముద్దలు ఎలా ఉంటాయో చూపించిపోయారు. అక్కడితో ప్రజలు పాలకులని ప్రశ్నించడం మొదలుపెట్టారు. పాలకులు ఏమి చేయాలో పాలుపోక ఒకరిమీద ఒకరు పడటం నేర్చుకున్నారు. బలవంతులు బలహీనుల్ని తొక్కడం, మళ్ళి గందరగోలం మొదలైంది.
ఇలా రాజనీతి రాక్షసనీతిగా మారిన తరుణంలో పాలకులు మళ్ళీ బానిస రాజ్యం ఏలడం మొదలుపెట్టారు. పాలకులకు వత్తాసు పలికిన వారు బాగుపడటం మిగిలిన వారు బయటపడటం(జీవితాల్ని దేశానికి అంకితం ఇవ్వలేక), ఏమీ చేయలేనివారు మిన్నకుండటం జరిగింది. పాలకులు ప్రజల్నే భక్షించటం మొదలుపెట్టారు. ఎందుకు ఎలా అనేది తెలిసే ఉంటుంది. తెలియకపోతే తెలుసుకోండి. ప్రభుత్వం నడిచేదే ప్రజలు వ్రుత్తి ధర్మం సరిగ్గా నెరవేర్చినప్పుడు, అలాంటిది ప్రజలు అన్నం ముద్ద కూడా సరిగ్గా తినలేనప్పుడు వ్రుత్తి ధర్మం ఎలా పాటిస్తారు? పాటించలేరు. అలా పాటించలేనప్పుడు ప్రభుత్వం ఎలా నడుస్తుంది? నడవలేదు. అలా నడవలేని ప్రభుత్వం పాలకులకు బంగారు ముద్ద ఎలా పెడుతుంది? పెట్టలేదు. అలా బంగారు ముద్దని కోల్పోయిన పాలకుడు తెలివిమీరి పన్ను విధించడం మొదలుపెట్టాడు. అలా పాలకులే ప్రజల్ని భక్షించసాగారు. అసలే అన్నం ముద్దకే దిక్కులేని ప్రజలు పన్నులెలా కట్టాలో తెలియక వీధినపడటం వల్ల ప్రభుత్వం అనాధాశ్రమాలు మొదలుపెట్టి వారిని సాకసాగింది. ధనిక ప్రజలు, ప్రవాసీయులు ప్రభుత్వానికి అండగా నిలిచారు. అలా నిలవడం వల్ల ధనిక వర్గానికి పన్ను రాయితి లభించింది. మద్య తరగతి వాళ్ళు ఏమి చేయాలో పాలుపొక కష్టపడి సంపాదించడం మొదలుపెట్టారు. ఎంత కష్టం చేస్తారు పాపం, ఇంటికి ఒకరు కష్టం చేస్తే సరిపోవడం లేదని ఇద్దరు కష్టపడటం ప్రారంభించారు. కష్టంతో పన్నులు కట్టుకుని మనఃశాంతిని కోల్పోయారు.
అలా మనఃశాంతిని కోల్పోయిన వారు గుడిచుట్టు గుట్టచుట్టు తిరగడమే కాక కాస్త ఓదార్పునిచ్చే ప్రతి మనిషి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. అలా కొందరు మనుషులు ఎక్కువ మందికి ఓదార్పునివ్వడంతో దేశంలో బాబాలుగా అవతరించారు.మరి ఈ బాబాలు మరింత ఎక్కువ మందిని ఎలా ఓదార్చాలో ఆలొచిస్తుండగా ప్రవాసీయులు వారికీ ఓదార్పు కావాలని బాబాలను కలవడం మొదలుపెట్టారు. అలా బాబాలు కోరుకోకుండానే ప్రవాసీయులు, ధనిక వర్గాలు బాబాలకు వరాలిచ్చి వారికి బంగారు ముద్దలు పెట్టడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతుంటే పాలకులు ఊరుకుంటారా! బాబాలతో సంప్రదింపులు జరిపి వారితొనే సంసారం చేయసాగారు. ప్రభుత్వం నుంచి బంగారు ముద్దలు రావడం లేదని బాబాల దగ్గర తినడం మిగిలితే పొరుగు దేశంలో దాచుకుని కొంచం కొంచం తినడం పరిపాటైపోయింది. అసలు ఈ పాలకులు ఆ వ్రుత్తిలో ఎలా కొనసాగుతున్నారని ఎప్పుడో అనుమానం వచ్చుంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రజలు వ్రుత్తి ధర్మాన్నే పాటించలేనప్పుడు రాజనీతిని ఎలా వంటపటించుకోగలరు. అందుకే పాలకులు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలా వీరు బంగారు ముద్దల్ని తినడం, దాచుకొవడమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని, ప్రజల్ని కలిపి పిండటం మొదలుపెట్టారు. మరి స్వాతంత్ర్యం ఎందుకు వచ్చిందని ఆలోచించకండి, ఎందుకంటే అది ఇచ్చిందే మనం ఏ పనైనా చేయడానికి, చేసి పన్నులు కట్టి పాలకులను మేపటానికి. ఇలా మన తలరాతలను మనమే మార్చుకున్నామని తెలుసుకున్న ప్రజలు మళ్ళి వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక జాతకాలు చూసుకోవడం మొదలుపెట్టారు. కూటికి గుడ్డకి నిడనిచ్చే ఇంటిని కాపాడుకోవాలని వాస్తు శాస్త్రాలను అడుగులో అడుగేసి మరి వెంటపడ్డారు. ఎన్ని చేసినా పాలకులు ఊరుకుంటారా? వారికి కావలసిందే ప్రజలు కష్టపడటం, సంపాదించడం. మరి వాళ్ళుకూడా తినాలి కదా. అలా మనకి తెలియకుండానే మన ఇంట్లో ఒకరిగా జీవించసాగారు.
పాలకులు పాలైతే ప్రజలను వారు నీరు చేసి మరి కలిసిపోయారు. ఇక ఈ పరాన్నజీవులు కష్టపడి ఎలా బ్రతకగలవు? బ్రతకలేవు. అందుకే వారికి వారు సంస్థలని స్థాపించి మళ్ళి ప్రజలచేతే పనిచేయించుకుని వారు పదవి లేకపొయినా మేము జీవించగలం అని చేసి చూపించారు. ఇదేమీ తెలియని వళ్ళు వారికి జీవితాల్ని ప్రసదించారని మురిసిపోయి పాలకులని నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. పాలకుడు వారికి ప్రభువులా కనిపించసాగాడు. మరి కొంత మందికే అలా కనిపిస్తే ఎలా? అందరికి అలాగే కనిపించాలని ఆలోచించి చించి పేద ప్రజలకి, భూమిపుత్రులకి సరఫరా నిలిపివేశాడు. తనని ప్రభువుని చేస్తే వారికి సరఫరా అందుతుందని చెప్పి వారి చేత కూడా ప్రభువనిపించుకున్నారు. అలా ప్రజలు అన్నం ఎలా ఉంటుందో మరిచిపోతున్న తరుణంలో మరికొంతమంది పాలకులు ప్రభువులనిపించుకోవాలని వారికి అన్నం ముద్దల్ని భాగాలుగా చేసి పంచిపెట్టారు.
అలా మరికొంత మంది కూడా ప్రభువులనిపించుకున్నారు. ఇలా అనిపించుకున్న ప్రతి ఒక్కరు భూమిపుత్రుల్ని భూమికి దూరంచేసి సంస్థలు స్థాపించి వ్రుత్తిలేనివారికి వ్రుత్తిని, తలదాచుకోలేని వారికి ఇంటిని ఇస్తామని, కావాలనుకున్నవారు వారికి ముద్దలు దోపాలని, ప్రభువుని చేయలన్నారు. ఈ క్రమంలో భూమి పుత్రులు ఒకొక్కరిగా అంతరించిపోవడం మొదలైంది. భూమాత పుత్రశోకం మొదలైన క్రొత్తలో ఏడ్చి ఆ తరువాత అలవాటైపోయి ఏడవటం మానేసింది. తడి తగలని ముఖం ఎండిపోవటం జరిగింది. వర్గాల ప్రజలు వీటిని తిరస్కరించారు. గుంపులు కూడి నినాడాలు చేశారు. మళ్ళి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది.

Comments

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine