Posts

Showing posts from July, 2011

My Love

వాలు చూపు పైకి చూసినప్పుడు కనిపించు ఆకాశమంత, చెయ్యి జాపి అందుకునప్పుడు దొరకనట్టి గాలి అంత, ఎంత నడిచిన విస్తరించినట్టి ఆ నేల తల్లి అంత, అమ్మ పంచె ప్రేమలాంటిదంట నా చిన్ని హృదయమంతా!!!

Lokpal Day

గుండెల్ని చీల్చే బాధని గుపెట్లో పెట్టి చిదిమేస్తున్న గూండా జనాలు, గుండెను పిండి గుడికడితే గుంజుకుని మరీ గుటకాయించే గోలాకారాలు, ఆరాదించి అవకాశమిస్తే అవసరాలు తీర్చుకుని అర చెయ్యికి కమలాన్ని అందించే రాజకీయులు, అలోచిస్తూపోతే చెప్పుకునేవాడికి కూడా తెలియకుండా దోచుకుపొయ్యే దోపిడిదారులు, దేశాన్ని ఉద్ధరించడానికి ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా, వచ్చిన ప్రతి తలకి తాడుచుట్టి వేలాడదీయడం ఖాయం...!!!

kasaayee

కసాయి కత్తికి కర్మతో పని లేదు, కత్తి పట్టిన కసాయికి కన్నీటితో పనిలేదు, కతేత్తితే రక్తం సెలయేరై పారాల్సిందే, చచ్చిన పాయకి కర్మకాండ జరగాల్సిందే!!!

Sleep

ఏదో ఏదో భారం కన్నులపైన, మత్తుగా, తిరుగుతున్నట్టుగా, లీలగా, కనురెప్పలు వాలుతున్నట్టుగా...... ఎమో ఎమో తెలియకనే తూలుతున్న, తిప్పుతున్న తలతో మునిగినట్టుగా వున్నా నిలబడటానికే చూస్తున్నా, చూస్తున్న చూస్తున్న మైకం కమ్మిన కనుమబ్బుల చాటునుంచే పని చేస్తున్న, ఎక్కడో ఎక్కడో ఉన్నట్టుగా వున్నా పనిపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్న, కాని నిద్రపోతున్న...!!!

Warning

నాకెందుకు నాకెందుకు అనుకున్నప్పుడు నన్నే నాకేయాలని అనుకునే వాళ్ళకి నరాలు తెగుతాయి!!!

Wants & Grants

బంధు మిత్ర జన సందోహాలు వద్దు, వీళ్ళని కాపాడే గుండె ధైర్యమే ముద్దు, కుల మత కూలంకషాల మాటే వద్దు, వీళ్ళని మమేకం చేసే చైతన్యమే ముద్దు, హద్దులు పెట్టి దద్దులు రేపే ప్రభుత్వాలు మాకొద్దు, వీటన్నింటినీ నడపగలిగే ఆ ఒక్క రాఘవుడే ముద్దు!!!

I, Adjective

energetic,enthusiastic,elastic............! sportive,supportive,sophisticative......! affective,affirmative,allocative..............! correlative,conceptive,confirmative...!!!