Posts

Showing posts from March, 2012

Lookam Teeru!

కాలిన బూడిద కంచం నిండుగా కర్షకులకు కూడౌతుంటే, కాల్చుకుతినే నేతలు చేతుల నిండుగా చేతలు చూపుతున్నారు! పట్టెడన్నం దొరకక రైతన్నలు పందిరిపీకి పాడెకడుతుంటే, పట్నంలో పెద్దలు పంచదారతో పరమాన్నం తింటున్నారు! చెమటోడ్చగా చిందిన నీరుని దోసిలితో నింపుకుని దాహం తీర్చుకుంటుంటే, దేహసుద్దికై దర్మాసనంబునెక్కి గేదలై ప్రజల రక్తాన్ని కుడితిలా తాగేస్తున్నారు! గూడేలేక గుడ్డ తడిపి చెట్టు క్రింద తలదాచుకుంటుంటే, గొంతు నలిపి చెట్టు కొట్టి గోడలు కట్టేస్తున్నారు! భూమి కొంచం సాగు చేసి పచ్చందాలు పండిస్తామంటే, పంటను సైతం పెంటని చేసి కర్మాగారాలు నిర్మిస్తున్నారు! 'రాఘవ నామ రామ చూపరా మాపై ప్రేమ'  అంటే, 'తప్పదురా మీకీ కర్మ ఇది రాజకీయుల డ్రామా' అంటున్నారు!!!

Lovingly Baatasari

నే పయనించా ఒక అందం వెనుక రాగానై, అనురాగానై!  నే సుఖియించా ఆ బంధం యొక్క అందాన్ని, ఆనందాన్ని! తన కలిమితో కురిపించింది ముసి నవ్వులని వెండి వెన్నెలని! తన చెలిమితో చిగురించింది నాలో ఆశయై ప్రతి శ్వాసయై!  చిరునవ్వుతో తను దాచింది ఒక వేదనని, ఆవేదనని! ప్రేమతో తను పంచింది ఒక లోగిలిని తన కౌగిలిని!!!

Happy Holi

రంగు రంగుల జల్లులు, నేల మీది హరివిల్లులు! కాంతుల్లన్ని కలిపి చేసే అందమైన అలజడులు! మనుషులంతా కలిసి చేసే చిన్ని చిన్ని అల్లర్లు! మనసులే మైమరిచి చేసే చిలిపి గొడవలు! రొజు మొత్తం నింగినంటే సంబరాలు, సందడులు! క్రొత్త ఉత్తెజాన్నిచ్చే హోలి నాడు, అందరికి ఇవే మా పండుగ శుభాకాంక్షలు!

Sri Sri Sri Pulibongaram!!!

సత్సమ్మేళన సమ్మొహన సువర్ణ సుమనోహర సుందరాకరం, శ్రీ శ్రీ శ్రీ పులిబొంగరం! కారంతో కర కర మంటు కమ్మని రుచిని పంచును, ఈ పిండిపదార్దం! వేడిని సైతం లెక్క చేయక ఉఫ్ ఉఫ్ మంటు లొట్టలేసే రుచికరం, మన పొంగళం! ఉల్లికారంతో తినుటకు ఊతమిచ్చే ఉత్తమమైన ఉపాయం, ఈ గుండ్రాకారం! బంగారు వన్నెతో బుద్దిగా బ్రహ్మాండమైన రుచిని పంచే తినుబండారం, మన బొండం!