Lookam Teeru!
కాలిన బూడిద కంచం నిండుగా కర్షకులకు కూడౌతుంటే,
కాల్చుకుతినే నేతలు చేతుల నిండుగా చేతలు చూపుతున్నారు!
పట్టెడన్నం దొరకక రైతన్నలు పందిరిపీకి పాడెకడుతుంటే,
పట్నంలో పెద్దలు పంచదారతో పరమాన్నం తింటున్నారు!
చెమటోడ్చగా చిందిన నీరుని దోసిలితో నింపుకుని దాహం తీర్చుకుంటుంటే,
దేహసుద్దికై దర్మాసనంబునెక్కి గేదలై ప్రజల రక్తాన్ని కుడితిలా తాగేస్తున్నారు!
గూడేలేక గుడ్డ తడిపి చెట్టు క్రింద తలదాచుకుంటుంటే,
గొంతు నలిపి చెట్టు కొట్టి గోడలు కట్టేస్తున్నారు!
భూమి కొంచం సాగు చేసి పచ్చందాలు పండిస్తామంటే,
పంటను సైతం పెంటని చేసి కర్మాగారాలు నిర్మిస్తున్నారు!
'రాఘవ నామ రామ చూపరా మాపై ప్రేమ' అంటే,
'తప్పదురా మీకీ కర్మ ఇది రాజకీయుల డ్రామా' అంటున్నారు!!!
Comments
Post a Comment