Dailogue Dhusyasana

కలిసిరాని కాలమున,

బలహీనతలే ఆట బొమ్మలుగా,

కలిమి మనుషులే ఆటలాడ,

కాల ధర్మమే మర్మము చేయ,

బొమ్మలోని ప్రాణము నీదై ఆడుకుంటిరే.....

నిన్ను కించించ...

కించనతో వంచించ ...

నవ్వుకుంటిరే అలనాటి మయసభలో దుస్యాసనుని చూసిన పాంచాలివలె

కర్మకిటుల బానిసను చేస్తివే అహో!....

ఇది ధర్మమా!

ఏనాటి పాపమునకు ఈనాడు శాస్తిననుభవించ నవ్వులపల్జేస్తివే...

ఈ భారము నేనెటుల బరాయిన్చను!

నేనెరుగని పాపమునకు నాకు శిక్షలేల!

పగబట్టుటకు వారు చేసిన తప్పిదము కానరాకపోయెన్..!

కడుపులో కుట్రకు దారి చూపకు,

కాల మర్మమును తెలియజేసి కన్నులకు కాంతిని ప్రసాదించు!

కనురెపవై కాపాడరావా కాల భైరవ!

Popular posts from this blog

Andharilo Nenu...!!!

Sri Sri Sri Pulibongaram!!!

Drinker's Routine