Posts

Showing posts from June, 2011

Drinker's Routine

బలవంతుల బలిమి కొరకై బలహీనులకి బ్రాంతి చూపేవు, బలము బలము అని విర్రవీగేవు ఎవ్వర్రి తోడు కోరేవు, తలమునకలై తాగేవు తలుకులకై తెగ మురిసేవు, తన తత్త్వం మరిచేవు మన మద్యనే మంట రేపేవు, మనిషివా నువ్వు వింత పశువు మతికి ముసుగు వేస్తావు, మత్తు మత్తు అంటావు మాటలే మారుస్తావు, మనుగడనే చెడగొడతావు మనసులనే గాయపరుస్తావు మనిషివా నువ్వు వింత పశువు !!!

Student n Employee

Q: What is the difference between student and employee? Ans: Student will have exams one after another after learning all subjects...whereas employee will have all tests at a time even without learning all subjects...!!!

Emotions

నిజానికి లేని ఈ హావభావాలు అబధపు అతుకులకు ఎందుకీ గుండెకోతలు

I Me Myself

గర్వం గర్వం మదించిన పర్వం సర్వం సర్వం నేనైతే, అణచివేయుటకై వచ్చిన సర్పం కాలం కాలం హతమైతే, రాజుల రాజ్యం ఏలిన మాద్యం మొత్తం మొత్తం నాదైతే, దైవం నేనే దెయ్యం నేనే మనిషిని నేనే మనుగడని నేనే సర్వం సకలం నేనేరా!!!

Me - The Saviour

కత్తులకెందుకు కండఖావరం కంటి చూపునై కాపుకాస్తుండగా.... శత్రువులకెందుకు ఆయుధం కవచమై నే రక్షిస్తుండగా..... కాటికెందుకు కళేబరం అమృతమై నే బతికిస్తుండగా...... జనానికెందుకు అంత భయం అభయమై నేనుండగా....

Harassement on girls

లవడాలెగరేసే లజ్జలేని నా కొడుకులు, లుంగిలెత్తి లంగాలకే లంగర్లేస్తుంటే, మానానికి విలువెక్కడ? స్త్రీకి రక్షనెక్కడ? బంధమై అనుబంధమై నీడవై తోడువై, నడిపించే నావవై వెలుగుపంచే కాంతివై, అనుకుని వెంటవచ్చిన అనురాగాన్ని వెక్కిలించి, ఆవురావురుమని ఆశ్వాదిస్తానంటే, అనుబంధానికి తావెక్కడ? ఆడజన్మకి నమ్మకమెక్కడ?

Inner/Office Politics

రుబ్బకు రుబ్బకు రుబ్బి రుబ్బి దిబ్బలుగా మార్చకు, సాదకు సాదకు సాది సాది బుర్రలు బద్దలు కొట్టకు, పెగలకు పెగలకు పెగలి పెగలి పరువు తీసుకోకు, అణచకు అణచకు అణచి అణచి అంబరం చేరకు, ఎగరకు ఎగరకు ఎగిరి ఎగిరి గొయ్యలో పడకు!

Corruption

నర నరం రుద్రమైన క్షణం స్వర స్వరం గళమెత్తిన దినం మన జనం కోరినట్టి వరం తెలుపుదాం దాచినట్టి నిజం పంచుదాం వక్రోత్తముల ధనం...!!!

Security with Pollution

Pollution gave extra security for girls...Boys are incurious at least for sighting girls bcoZ of covering their faces...!!!

Leader

దారిద్ర్యాన్నే తరిమికొట్టే దైవరూపం దీపమయ్యెను, కార్యసిద్ధితో వచ్చిన కర్త కాలములోనే కలిసిపోయెను, కాదేది మాకు అసాధ్యం... కన్నుల్లో నీ రూపం పదిలం, గుండెల్లో నింపిన ధైర్యం పదిలం, పోరాడుతాం పోరాడుతాం నీ ఆశయాన్ని సాధ్యం చేస్తాం!!!