Posts

Showing posts from December, 2011
కష్టాలొస్తే కన్నీళ్ళోస్తాయి కట్టుబాట్లు తెలుస్తాయి కర్తవ్యాన్ని గుర్తుకుతెస్తాయి !!

Truth-Lie

అబద్దం అప్పులాంటిది, తీసుకుంటే వడ్డీ కట్టక తప్పదు నిజం నిష్టలాంటిది, ఆపితే మొదలుపెట్టక తప్పదు!!

Trust

నమ్మకం నమ్మినవాడిని దెబ్బతీస్తుంది నమ్మించినవాడు నమ్మకాన్ని దేబ్బతీస్తాడు రాఘవుడు నమ్మించినవాడి నమ్మకాన్ని దేబ్బతీస్తాడు!

Vote Raghava

ఉప్పు కర్పూరంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు మనుషులందు, సత్ రాజకీయులు లేరయ రాఘవ నామ రామ, వి-వింగ్స్ కి ఒటేద్దామా !!

Power

చదువు, ధనం, బలం అన్ని ఒక్కసారి రావు. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి!

Worker

కూటికేమో బహ్హద్దూరులు గుడ్డకేమో బలాదూరులు పీనాసియాయే మట్టిమనిషి సంపాదనల్లేక దీనులై !!!

Success Way

రారా రారా బాటసారి పరిచెను నీకై పూలదారి స్వర్గానేలే మంచిదారి అడుగువెయ్యర ఒక్కసారి

Interests-Achievements

ఒక మనిషి తనకిష్టమైన పనిని చేయడంలో ఎంత డబ్బు ఖర్చుపెట్టిన ఫర్వాలేదు, కాని ఆ పనిలో తను సఫలమవ్వాలి, లేకపోతే తనకు సమాజంలో విలువుండదు !!

Money Money More Money

డబ్బు డబ్బు డబ్బు మనిషికి పట్టిన జబ్బు పీల్చిన వచ్చును గబ్బు కళ్ళను కమ్మిన మబ్బు డబ్బు డబ్బు డబ్బు సువాసనలీనే సబ్బు తలరాతను మార్చే నిబ్బు మరి చేతికి వస్తే సుబ్బు! మనుషులు అవ్వును తబ్బిబ్బు !!

Miser-Mercyman

డబ్బులు ఖర్చుపెట్టని ప్రతి ఒక్కడు పిసినారికాడు డబ్బులు ఖర్చుపెట్టె ప్రతి ఒక్కడు దయాహృదయుడుకాడు!!

Life

జీవితం జీవితం కలలకే అంకితం జీవితం జీవితం కన్నీళ్ళ కెరటం సముద్రం ఈ జీవితం నీటి బొట్టే ఆనందం అడుగువేస్తే దుఃఖం కనుమరుగవ్వును కృషి ఫలితం జీవితం జీవితం నిజానికిది నరకం కనిపించని స్వర్గం కళ్ళలోనే పదిలం !!!

Good Day Health

గుడ్ మార్నింగ్ గురు, గుడ్డే-డే తింటే గుడ్ హెల్త్ గురు, 4 పూట్ల ఒన్స్ మోర్ షురు, ప్రొబ్లెంస్ నీకు సో ఫార్ గురు, చేపిందినుకో రైట్ నౌ సరు!

Educate

చదువుతో వచ్చేది జ్ఞానం చదువులేక వచ్చేది అజ్ఞానం జ్ఞానం పులిలాంటి హోదానిస్తుంది అజ్ఞానం పిల్లిలా పరిగెట్టిస్తుంది!!!
ఒంటి మీద చేసిన గాయాలు ఒళ్ళొంచితే తగ్గిపోతాయి, కాని గుండె మీద చేసిన గాయాలు గుండంలో అగ్నిలా కాలుతూనే వుంటాయి !!!
స్టార్ తిరిగితే స్ట్రాలమ్ముకునేవాడైన 5 స్టార్ హోటల్ కట్టచ్చు !!!

Success Feet

అడుగువేయి ముందుకు వేసి చూడు భయమెందుకు ఓడినట్టి ఊసెందుకు పోరాడి చూడు గెలిచేందుకు విజయం దక్కును నీకు !!!

Success Feet

అడుగువేయి ముందుకు వేసే అడుగునాపకు ఆపిన వెనుతిరగకు పోరాడు కొనవరకు విజయం దక్కును నీకు !!!
సవాల్ చేశానంటే సింహమైన సత్తువణగిణట్లుండాల్సిందే...! 

Manly

మాటలు నేర్చిన మగాళ్ళకే, మాటలు నేర్పిన మొనగాణ్ణి, మారు మాట్లాడితే మాటలులేకుండా చేస్తా...!

Success Heart

బండబారిన హృదయం నుంచి కనీటిబొట్లు పడిన వేళ, తన విజయం తన నుంచి చేజారిపోయిన వేళ, అతను తిరిగి పట్టు జారనివ్వక కృషిచేసిన వేళ, అతను ఒక్కొక్క మెట్టుకి ఎదుగుతున్న వేళ, అది చూసిన తల్లి హృదయం సంబరపడిన వేళ, అతని మనస్సులో ఆనందాన్ని వర్ణించలేని వేళ, అతనికి ఆ విజయం సొంతమైన వేళ కోసం ఎదురుచూడాలి ఈ వేళ!

Time, Work, Struggle and Success

టైం చిన్నది, పని పెద్దది, సడలని కృషిది, విజయం మనది!

Struggle & Success

సాహసం చేయరా సడలని కృషి నీదిరా, పట్టుబడర పట్టుదల వీడకురా, వీరఖడ్గం చేతబట్టర విజయాన్నే వరించురా, అనుమానం వద్దురా అనుకున్నది జరుగునురా!

Mathematical Life

Add aim to the Life, Subtract fear from the Heart, Divide the subject and Study, Multiply the Success with Hardwork!

Heart Beat

హృదయధ్వనులు! గుండెల్లో ఉపెనలై పొంగే అగ్నిపర్వతాలు, హృదయధ్వనులు! యుద్ధానికి సిద్ధమైన హూంకారాలు, హృదయధ్వనులు! దేశం కోసం పోరాడే అంకితభావాలు, హృదయధ్వనులు! విజయాన్ని చేతపట్టిన ఆనందరాగాలు!

Relation

అమ్మ నాన్నలు పంచిపెట్టే కారం మమకారం, హృదయం పాడే రాగం అనురాగం, అత్మీయులచేత వేయబడిన బంధం అనుబంధం, ఇతరులచేత అభినయించబడే మానం అభిమానం!

Work & Success - 2

అదురెందుకు బెదురెందుకు మొలకెత్తే ఈ జగాన, అలుపెందుకు అలసటెందుకు పోరాడే ఈ క్షణాన, బయమెందుకు మంత్రమెందుకు సందించు ఈ సమయాన, గెలుపేదో ఓటమేదో తేల్చిచెప్పు ఈ నిముషాన, ఓయీ విజయసారధి దిగులువదిలి విజయపతాకాన్ని అందుకోవోయి!

Work & Success

జయం జయం విజయం విజయం మా దారికి లేదు పరాజయం, క్షణం క్షణం ప్రతి క్షణం ఇక వేసే అడుగే బయంకరం, ఆదరం బెదరం పిడుగుకు చెదరం నిప్పుల కనికెలె ఆయుధం, మంత్రం తంత్రం వేసే యంత్రం మాకే మాకే ఇక సొంతం, అడుగులు వేస్తాం పరుగులు తీస్తాం కనిపెడతాం విజయరహస్యం, ఎదురేలేక ఘట్టం మునుపున ఎగురేస్తాం విజయపతాకం!

Play, Risk and Need

ఉన్నపుడేమో చలగాటం, లేనప్పుడేమో పోరాటం, అది తెలిసిననాడే ఆరాటం!

Lokam Teeru

సిగ్గు విడిచిన లోకానికి సర్ది చెప్పి చీర కడుదామనుకుంటే, అధికారమనే డేగ కన్ను చీర అనే ధర్మంఫై పడింది. విచ్చలవిడిగా చీర్చి కాకులనే అధికారులకు దాహం తీర్చుటకై ధనాన్ని అధర్మంగా దానం చేసింది. పెత్తనం అనే పైశాచికాన్ని నెత్తినేసుకుని ప్రజలపైనే స్వారి చేస్తోంది.