Posts

Showing posts from 2012

Gone Through Wind(ఎటో వెళ్ళిపోయింది మనసు)

one love says "you are my responsibility", another love says "you are my feelings", myself thinks "my heart is gone through wind", others says "we know where it went"...!!! ఒక ప్రేమ నువ్వే నా భాద్యత అంటుంది, మరో ప్రేమ నువ్వే నా బాదంతా అంటుంది, ఎటో వెళ్ళిపోయింది మనసు అని నేననుకుంటున్నాను, ఎటెళ్ళిందో మాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు....!!!

జీవిత చక్రం - Life Cycle

పుట్టే ప్రతి బిడ్డ కష్టం, సుఖం రెండు ఇస్తుంది, ఎదిగే ప్రతి ప్రాణి తప్పు, ఒప్పు రెండు చేస్తుంది, అలసే ప్రతి శ్వాస పాపం, పుణ్యం రెండు మోస్తుంది...!!! Every child birth will give Sadness and Happiness, Every human growth will do wrong thing and right thing, Every resting soul will carry sin and virtue...!!!

Let Me Live (Save Tiger)

Let me live brother....Let me live..... Don't fight me brother... don't fight me.... There are no bones special to break... There is no part special to preserve... There is no special art which kills me.. There is no hunger taught you special to fight me.... Don't  fight me brother....don't fight me.... I am also the one to live.... I am the only one to live.... I am the only one to live of my being.... Let me live....Let me live..... Extincts never come back.... Living are the only hope in future.... Oh brother....don't fight me..... Let me live....let me smile.... Let me play...let me die..... Don't fight me brother...don't fight me... Let me smile with you brother with a speechless manner in a happy home with you at a hill way and me in a forest bay..... Let me play with you brother with a mindless manner in absence to the hurtings of our never ending diversities from a unique root.... How...

Thoughts on Friendship

People must agree the thought that friendship is not a flirting act between two opposite sexuals... Others will use the name friendship for those purposes... But Friends will not fall under the same category... Do not poke and dwell Friendship as a Abuse relation.... If your mind and heart is eternal giving then there is no need to worry about it...

My College Day

In a breezy day with a lazy woke up moving towards dirty bathrooms to watch my dumpy buddies doing their mouth washes and blowing perfumes into air from bumpy activities @ night sleep.... Myself half-sleep walking for a coffee looking into air to make a move for the hot drink and clean myself to make others feel better in my classroom(to say no one do this perfectly).... Not to feel alone while eating, i will wait for my roommates to take breakfast as if to make others believe i am a gud guy (but inside grouching them for late)..... Thus completing morning routines to walk into college in time with a prepped style (to sleep again like a fish)...... Air blows with morning freshness to increase the ooommmppphhhhh factor making boys to look at mesmerizing mermaids walking in the corridors..... Late-Comers may miss those fashionista's (classes start at 9am and after 11am sun may act on those beauty's facials)..... Hitler's classes blows on ears grabbing...

నాలో నేను!

మనసులో ఏవో చెరగని గాయాలు మౌనాన్నే తట్టి లేపుతుంటే, మదిలో  ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి! పాల సముద్రం లాంటి నా కళ్ళలో ఎర్రటి నెక్తుటి అలలు సాగరాన్నే కప్పేస్తున్నాయి! పిడికిలంత ముద్దలు తినిపించే చేతులు పంజాలనే విసరాలంటున్నాయి! నలుగురి బాటలో నడిచే నా కాళ్ళు పరుగులంఖించి భూమిని దద్దరిల్లేట్టు చేయాలంటున్నాయి! నరాల్లో ఏదో నిడివంత ప్రవాహం నరుడ్ని నిలువెల్లా దహిస్తుంటే, నరనరాలు చిట్లించిన మొహం నరరూప రాక్షసుల అంతం చూస్తానంటోంది. రెక్కలు విచ్చుకున్న నా చెవులు వారి చావు కెకలనే వినాలంటున్నాయి!

Power

సంసారం అనే సాగరాన్ని ఈదే శక్తి నాకు లేకపోయినా ఫర్వాలేదు కాని నాలా పయనించే వాళ్ళని ఇతర జీవులకు బలికాకుండా కాపాడే శక్తి నివ్వు.

స్వాతంత్ర్యాం కోసం పోరాడిన ఆరోజు నుంచి పోరాడుతున్న ఈరోజు వరకు మధ్య సమయం

కుల గోత్రాలు, జాతకాలు, వాస్తు శాస్త్రాలు ఎందుకు పుట్టాయోగాని వాటిని చాల మంది మరిచిపోతున్నారు ఈరొజుల్లో. ప్రేమ అనే బంధం వీటికి అతీతంగ నడుస్తూ వీటిని రూపుమాపుతోంది. ఇదేకాక విఙ్ఞాన ప్రపంచం ఆధునికత అంటూ అందరు తప్పు దారులు పడుతున్నారు. హిందూ శాస్త్ర ధర్మాలు అని పూర్వీకులు ఎందుకు పెట్టారోగాని, వీటి గురుంచి ఎంతో శోధన చేసి ప్రజలకి అప్పట్లో నమ్మకం కలిగించారు.రాను రాను మనవాళ్ళు మన సంస్క్రుతి మరిచి ప్రవర్తిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అందుకు ప్రధాన కారణం జనాభా సంఖ్య అమాంతం పెరిగిపోవటం. దీని వల్ల అందరు ముందుగా బ్రతకటానికి చూస్తారు. బ్రతకటానికి డబ్బు కావలి. డబ్బు కావాలంటే సంపాదించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి ఒక మగాడు సంపాదిస్తే సరిపోవడంలేదు. అందుకని ఆడాళ్ళూ సముపార్జనలో దిగారు. కొందరు కూటికోసమైతే, కొందరు ఆధునికత, తళుకుల ప్రపంచంలోని అందాలను వీక్షించడం కోసం. అలా ఆడ మగ తేడాలేకుండా సంపాదన కోసం ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి ఇంకొకరికి మధ్య దూరం చెరిగిపోయి పరిచయాలు పెరిగిపోయి ఆకర్షణకి గురయ్యి, మత్తులో మునిగి తేలుతు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తున్నారు. రాను రాను సంసా...

Political Drama

రాజకీయులు,  తూర్పులో కూర్పు చెసి,  దక్షిణాన దాగుండి,  పడమట పంజా విసురుతారు,  నిన్ను ఉత్తరాన పడుకోబెట్టడానికి!!!

G-Scam

మా మంచి  వృక్షం   మహారణ్యంలొ బారులు తీరుండెను! మాయదారి కాకి గుంపు చెట్టు నీడకై వచ్చి టలడాచుకుంటుండెను! పండుకి పిందెకి భేదం తెలియక కాయలన్ని రాల్చుచుండెను! గూడని, గుట్టని ఆకుల్ని కొమ్మల్ని తెంపి దొచుకుపోవుచుండెను! మాయదారి కాకులు మతిలేని ఆలోచనలు తుదిని గ్రహించలేకపోయెను! చెట్టుని రట్టు చేసి దొరికిందంత దొచుకుపోయి భటుకుచుండెను! ఎండిన చెట్టు సంపద కోల్పోయి ఒంటరయ్యెను! వర్శం వచ్చిన దెబ్బకి కాకులు కట్టుకున్న గూడ్లు చెల్లాచెదురైపోయెను! మతిలేని కాకులే రాజకీయనాయకులైతే, మహా వృ క్షమే భూసంపదైతే, సుఖాలను పంచె మహా వృ క్షము యొక్క విలువ నీడలో బతకడం తెలియక,   వృక్షాన్ని  కూల్చి వారి జీవితాల్ని కూడా నాశనం చేసుకుంటున్నారు!!!

Imbalancing Relation (సరితూగలేని బంధం)

రాదేది, రాజులు రాగాలు పాడితే రంకెలేసుకుని! లేదేది, కర్మలకు కరీదుకడితే కనికరంచూపేది! ఆరదేది, మతిలేని మాటలు మంటలై మనుషులను రాజుకుంటే! చెరగదేది, మాయని మచ్చలు మనసులో ముద్రలేసుకుపొతే! దారేది దేవర? దరిద్రపు మాటున దాగి ధీనులపై దయచూపకపొతే!

Lookam Teeru!

కాలిన బూడిద కంచం నిండుగా కర్షకులకు కూడౌతుంటే, కాల్చుకుతినే నేతలు చేతుల నిండుగా చేతలు చూపుతున్నారు! పట్టెడన్నం దొరకక రైతన్నలు పందిరిపీకి పాడెకడుతుంటే, పట్నంలో పెద్దలు పంచదారతో పరమాన్నం తింటున్నారు! చెమటోడ్చగా చిందిన నీరుని దోసిలితో నింపుకుని దాహం తీర్చుకుంటుంటే, దేహసుద్దికై దర్మాసనంబునెక్కి గేదలై ప్రజల రక్తాన్ని కుడితిలా తాగేస్తున్నారు! గూడేలేక గుడ్డ తడిపి చెట్టు క్రింద తలదాచుకుంటుంటే, గొంతు నలిపి చెట్టు కొట్టి గోడలు కట్టేస్తున్నారు! భూమి కొంచం సాగు చేసి పచ్చందాలు పండిస్తామంటే, పంటను సైతం పెంటని చేసి కర్మాగారాలు నిర్మిస్తున్నారు! 'రాఘవ నామ రామ చూపరా మాపై ప్రేమ'  అంటే, 'తప్పదురా మీకీ కర్మ ఇది రాజకీయుల డ్రామా' అంటున్నారు!!!

Lovingly Baatasari

నే పయనించా ఒక అందం వెనుక రాగానై, అనురాగానై!  నే సుఖియించా ఆ బంధం యొక్క అందాన్ని, ఆనందాన్ని! తన కలిమితో కురిపించింది ముసి నవ్వులని వెండి వెన్నెలని! తన చెలిమితో చిగురించింది నాలో ఆశయై ప్రతి శ్వాసయై!  చిరునవ్వుతో తను దాచింది ఒక వేదనని, ఆవేదనని! ప్రేమతో తను పంచింది ఒక లోగిలిని తన కౌగిలిని!!!

Happy Holi

రంగు రంగుల జల్లులు, నేల మీది హరివిల్లులు! కాంతుల్లన్ని కలిపి చేసే అందమైన అలజడులు! మనుషులంతా కలిసి చేసే చిన్ని చిన్ని అల్లర్లు! మనసులే మైమరిచి చేసే చిలిపి గొడవలు! రొజు మొత్తం నింగినంటే సంబరాలు, సందడులు! క్రొత్త ఉత్తెజాన్నిచ్చే హోలి నాడు, అందరికి ఇవే మా పండుగ శుభాకాంక్షలు!

Sri Sri Sri Pulibongaram!!!

సత్సమ్మేళన సమ్మొహన సువర్ణ సుమనోహర సుందరాకరం, శ్రీ శ్రీ శ్రీ పులిబొంగరం! కారంతో కర కర మంటు కమ్మని రుచిని పంచును, ఈ పిండిపదార్దం! వేడిని సైతం లెక్క చేయక ఉఫ్ ఉఫ్ మంటు లొట్టలేసే రుచికరం, మన పొంగళం! ఉల్లికారంతో తినుటకు ఊతమిచ్చే ఉత్తమమైన ఉపాయం, ఈ గుండ్రాకారం! బంగారు వన్నెతో బుద్దిగా బ్రహ్మాండమైన రుచిని పంచే తినుబండారం, మన బొండం!

Scam! Scam! Scam!

లూఠీ లూఠీ లూఠీ, చూపిస్తుంటారు లాఠి, దోచుకుంటుంటారు శతకోటి, లేరెవ్వరు వీరి సాటి, రాజకీయులతోనా పోటి, వీరి బుర్రలు చాలా గట్టి, గొడవలు వీరికి పరిపాటి, కలిసే తీరుని బట్టి, చూపును గుర్తులు తలుపులు తట్టి, కొత్త కొత్త పార్టీలు పుట్టి, నొట్లతో చేతులు కట్టి, గుద్దును ఒట్లు కొట్టీ! కొట్టీ! పిచ్చి పిచ్చి పథకాలు పెట్టి, ప్రభుత్వానికి పంగనామలు చుట్టి, బినామీలతో నింపును స్విస్స్ తొట్టి! 

Premaku cheragani gurthu, Nenu (A Love Memory, Me)

గడిచే కాలం పెరిగేకొద్ది మోయలేని భారం హృదయాన్ని కృంగతీస్తుంటే ప్రేమను వెతుకుతూ సుదూర తీరాలన్నీ ప్రయానిస్తున్నాను, తెలుసుకుందామని. ఇది వెతికితే దొరికేదికాదు, పంచుకుంటే పెరిగేది అని తెలియక ప్రయాణం సాగించాను. గడిచిన కాలాన్ని తిరిగి చూసుకుంటే నా ఒంటరి ప్రయాణానికి తోడుగా నిలిచిన స్నేహాన్ని చూశాను, ఆగిపోయాను. సరదాగా తిరిగాను, ఆటలాడాను, నువ్వే ప్రేమని తెలియక ఎన్నాళ్ళో నీ చుట్టూ తిరుగుతూనే గుర్తుపట్టలేకపోయాను. నాలో నువ్వున్నావని తెలియక ఎక్కడెక్కడో వెతికాను, అలిసిపోయాను. నువ్వు దూరమైతేగాని తెలియలేదు ఇది ప్రేమని, నేను పంచుకుంది స్నేహాన్ని కాదని. వదిలిపోయావు ఒంటరిని చేసి, ప్రేమకు చెరగని గుర్తుగా నన్ను మిగిల్చేసి.