కష్టాలొస్తే కన్నీళ్ళోస్తాయి కట్టుబాట్లు తెలుస్తాయి కర్తవ్యాన్ని గుర్తుకుతెస్తాయి !!
Posts
Showing posts from 2011
Lokpal Day
- Get link
- X
- Other Apps
గుండెల్ని చీల్చే బాధని గుపెట్లో పెట్టి చిదిమేస్తున్న గూండా జనాలు, గుండెను పిండి గుడికడితే గుంజుకుని మరీ గుటకాయించే గోలాకారాలు, ఆరాదించి అవకాశమిస్తే అవసరాలు తీర్చుకుని అర చెయ్యికి కమలాన్ని అందించే రాజకీయులు, అలోచిస్తూపోతే చెప్పుకునేవాడికి కూడా తెలియకుండా దోచుకుపొయ్యే దోపిడిదారులు, దేశాన్ని ఉద్ధరించడానికి ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా, వచ్చిన ప్రతి తలకి తాడుచుట్టి వేలాడదీయడం ఖాయం...!!!
Sleep
- Get link
- X
- Other Apps
ఏదో ఏదో భారం కన్నులపైన, మత్తుగా, తిరుగుతున్నట్టుగా, లీలగా, కనురెప్పలు వాలుతున్నట్టుగా...... ఎమో ఎమో తెలియకనే తూలుతున్న, తిప్పుతున్న తలతో మునిగినట్టుగా వున్నా నిలబడటానికే చూస్తున్నా, చూస్తున్న చూస్తున్న మైకం కమ్మిన కనుమబ్బుల చాటునుంచే పని చేస్తున్న, ఎక్కడో ఎక్కడో ఉన్నట్టుగా వున్నా పనిపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్న, కాని నిద్రపోతున్న...!!!
Drinker's Routine
- Get link
- X
- Other Apps
బలవంతుల బలిమి కొరకై బలహీనులకి బ్రాంతి చూపేవు, బలము బలము అని విర్రవీగేవు ఎవ్వర్రి తోడు కోరేవు, తలమునకలై తాగేవు తలుకులకై తెగ మురిసేవు, తన తత్త్వం మరిచేవు మన మద్యనే మంట రేపేవు, మనిషివా నువ్వు వింత పశువు మతికి ముసుగు వేస్తావు, మత్తు మత్తు అంటావు మాటలే మారుస్తావు, మనుగడనే చెడగొడతావు మనసులనే గాయపరుస్తావు మనిషివా నువ్వు వింత పశువు !!!
- Get link
- X
- Other Apps
నువ్వు వెళ్ళే దారిలో అడుగడుగునా ముల్లుంటే మొదట్లో గుచ్చుకునప్పుడు బాదపడతావు, తర్వాత బరాయిస్తావు, ఓర్పుగా వుంటావు తర్వాత చూసి నడవటం మొదలుపెడతావు, శక్తి పుంజుకున్నాక దారిలో ముల్లే లేకుండా ఏరేస్తావు, ఒకవేళ ఏదైనా గుచ్చుకున్నా దాన్ని తీసి పారేస్తావు. నువ్వు పొయ్యే దారే నీ జీవితమైతే, దారిలో ఎదురయ్యే ముల్లే నీ కష్టాలు, ఓర్పుగా బరాయిస్తే తర్వాత ఎదురయ్యే కష్టాల్ని సుఖాలుగా మార్చుకునే శక్తి నీకుంటుంది.
Dailogue Dhusyasana
- Get link
- X
- Other Apps
కలిసిరాని కాలమున, బలహీనతలే ఆట బొమ్మలుగా, కలిమి మనుషులే ఆటలాడ, కాల ధర్మమే మర్మము చేయ, బొమ్మలోని ప్రాణము నీదై ఆడుకుంటిరే..... నిన్ను కించించ... కించనతో వంచించ ... నవ్వుకుంటిరే అలనాటి మయసభలో దుస్యాసనుని చూసిన పాంచాలివలె కర్మకిటుల బానిసను చేస్తివే అహో!.... ఇది ధర్మమా! ఏనాటి పాపమునకు ఈనాడు శాస్తిననుభవించ నవ్వులపల్జేస్తివే... ఈ భారము నేనెటుల బరాయిన్చను! నేనెరుగని పాపమునకు నాకు శిక్షలేల! పగబట్టుటకు వారు చేసిన తప్పిదము కానరాకపోయెన్..! కడుపులో కుట్రకు దారి చూపకు, కాల మర్మమును తెలియజేసి కన్నులకు కాంతిని ప్రసాదించు! కనురెపవై కాపాడరావా కాల భైరవ!